top of page

ప్రొఫెషనల్ ఆన్‌లైన్ అనువాద సేవలు

Telugu

ఏ భాషకైనా, ఏ అంశానికైనా TranslationServices.com ప్రొఫెషనల్ అనువాద సేవలను అందిస్తుంది. హైదరాబాద్ సిటీ, విశాఖపట్నం, విజయవాడ మరియు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల కోసం మా నిపుణుల బృందం వేలాది పత్రాలను అనువదించింది మరియు మా పనితీరు పట్ల ఆ కస్టమర్లను ఎంతో సంతృప్తిని వ్యక్తం చేసారు. మీకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ లేదా చైనీస్ లాంటి ఏ భాషలలో అనువాదం కావాల్సివచ్చినా, మేము మీ ప్రాజెక్ట్ను అత్యున్నత ప్రమాణాలతో అనువదిస్తామని మీకు హామీ ఇస్తున్నాము.


కోట్ కోసం మమ్మల్ని సంప్రదించండి.


మేము అందించే సేవలు


వ్యాపారాలు, రచయితలు, విద్యావేత్తలు వంటి వివిధ నేపథ్యాలు గల క్లయింట్లకు TranslationServices.com అధిక నాణ్యతతో కూడిన అనువాదాలను అందిస్తుంది. ఎంతో అనుభవం కల మా అనువాద బృందం తెలుగులో అనువాద సేవలను అందించడంతో పాటు క్రమం తప్పకుండా 100 భాషలకు పైగా అనువదిస్తుంది. మేము అందిస్తున్నాము:

 

 • విద్యా సంబంధిత విషయాల అనువాదం. మేము ఏ అంశాన్ని అయినా సరసమైన ధరలకే తెలుగు నుండి ఇంగ్లీషుకు, తెలుగు నుండి జర్మన్ కు, తెలుగు నుండి జపనీస్ కు మరియు అనేక ఇతర భాషలలో అనువదించగలము అందించగలము.

 

 • వ్యాపార సంబంధిత విషయాల అనువాదం. మీరు ఒక కేటలాగ్ ను తెలుగు నుండి ఇంగ్లీషు లేదా మరొక భాషకు అనువదించాలని అనుకుంటున్నారా? మానవ వనరుల మాన్యువల్స్, ఉత్పత్తి వివరణలు మరియు ఇతర వ్యాపార,  మార్కెటింగ్ కంటెంట్ కోసం మేము వ్యాపార సంబంధిత అనువాద సేవలను అందిస్తున్నాము.

 

 • సాహిత్య అనువాదం. మీ అంతర్జాతీయ పాఠకుల సంఖ్యను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేము శృంగార నవలలు, సైన్స్ ఫిక్షన్ మాన్యుస్క్రిప్ట్‌లు, జ్ఞాపకాల పుస్తకాలతో పాటు దాదాపు అన్ని సాహిత్య శైలులను అనువదించాము. మా సాహిత్య అనువాదకులు మీ సాహిత్యంలోని స్వరాన్ని మరియు శైలిని కోల్పోకుండా ఉండే విధంగా ఎంతో నిపుణతతో పని చేస్తారు.

 

 • వైద్య సంబంధిత విషయాల అనువాదం. వైద్య సంబంధిత విషయాల అనువాదాన్ని మేము స్వయంగా అందించము. కానీ నోట్స్, మెడికల్ రిపోర్టులు, రోగుల ఇంటర్వ్యూలు మరియు ఇతర వైద్య పత్రాలను తెలుగులోకి లేదా తెలుగులో నుండి ఇతర భాషలకు త్వరగా మరియు కచ్చితంగా అనువదించగల వైద్య సంబంధిత విషయాల అనువాద సంస్థతో మాకు ఒప్పందం ఉంది.

 

 • చట్టపరమైన విషయాల అనువాదం. మీ అంగీకార లేఖలు, అఫిడవిట్లు, దస్తావేజులు, గోప్యతా విధానాలు మరియు ఇతర చట్టపరమైన డాక్యుమెంటేషన్లను అనువదించడానికి అనుభవం మరియు నైపుణ్యం కలిగిన చట్టపరమైన అనువాద సేవలను అందించే సంస్థతో మేము కలిసి పని చేస్తాము. మా భాగస్వామైన చట్టపరమైన అనువాద సేవలను అందించే సంస్థ ఎల్లప్పుడూ ప్రొఫెషనల్ గా ఉంటుంది మరియు మీ గోప్యతాను కాపాడుతుంది.

 

 • సర్టిఫైడ్ అనువాదం. మీకు అకాడెమిక్ ట్రాన్స్క్రిప్ట్, వివాహం లేదా విడాకుల ధృవీకరణ పత్రం లేదా ఇమ్మిగ్రేషన్ లేదా ఇలాంటి ప్రయోజనాల కోసం తెలుగు నుండి అనువదించబడిన ఇతర కీలకమైన పత్రం అవసరమైతే ఈ సేవను ఎంచుకోండి.

 

 • స్థానికీకరణ. మీ వ్యాపారాన్ని విదేశీ మార్కెట్‌లోకి విస్తరించాలని చూస్తున్నారా? మేము మీ కంటెంట్‌ను నిర్దిష్ట దేశాలు మరియు ప్రాంతాలకు అనుగుణంగా అనువదించగలము.

 

 • సబ్ టైట్లింగ్. మేము మీ వీడియోలలోని తెలుగు సంభాషణలను అనువదించగలము మరియు ఇటాలియన్, పోర్చుగీస్ లేదా వియత్నామీస్ వంటి ఇతర భాషలలో సబ్ టైటిల్స్ ను సృష్టించగలము.

 

 • సాధారణ అనువాదం. మీరు ఒక తెలుగు పత్రం యొక్క అనువాదాన్ని అతి త్వరగా పొందాలనుకుంటున్నారా? మేము సరసమైన ధరలకే అన్నింటినీ కచ్చితంగా అనువదిస్తాము. కాబట్టి మీ తెలుగు అనువాద అవసరాలను చర్చించడానికి మమ్మల్ని సంప్రదించండి.

 


మా పరిచయం


TranslationServices.com లోని అనువాదకులు ఉన్నత అర్హత కలిగిన నిపుణులు, నిరూపితమైన అనుభవం కలవారు మరియు వివరాలపై అసాధారణమైన శ్రద్ధ వహించేవారు. మా తెలుగు అనువాదకులు పలు విషయాలలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు. అంటే మేము ప్రతి ప్రాజెక్ట్‌ను తగిన జట్టు సభ్యునికి కేటాయిస్తాము. చాలా సరళంగా చెప్పాలంటే మేము హైదరాబాద్ సిటీ, విశాఖపట్నం, విజయవాడ మరియు ఇతర ప్రాంతాల ప్రజలకు ఉత్తమ అనువాద సేవలను అందిస్తాము.

 


TranslationServices.com తో పని చేయడం వలన లాభాలు

 

 • మేము సరసమైన ధరలకే వ్యాపార సంబంధిత విషయాలకు, విద్యా సంబంధిత విషయాలకు మరియు ఏదైనా అంశానికి సంబధించిన లేదా శైలికి సంబంధించిన సాహిత్యానికి ఖచ్చితమైన అనువాదాన్ని అందిస్తాము.

 • మేము ఏ భాషలోనైనా, ఏ అంశానికైనా ప్రొఫెషనల్ మరియు మానవ అనువాదాన్ని అందిస్తాము.

 • ఇతర అనువాద సేవల మాదిరిగా కాకుండా మేము యంత్ర అనువాదంపై ఆధారపడము. దానికి బదులుగా ప్రతి అనువాద ప్రాజెక్టును మా ప్రొఫెషనల్ బృందంలోని సభ్యులకు అప్పగిస్తాము.


మా నిపుణులైన అనువాదకులు సాధించిన ఉన్నత నాణ్యతా ప్రమాణాల గురించి మేము గర్విస్తున్నాము మరియు మా పని పట్ల మీ సంతృప్తికి మేము హామీ ఇస్తున్నాము.


కోట్ కోసం మమ్మల్ని సంప్రదించండి.

bottom of page